నిన్ను కాపాడు దేవుడు

Telugu Christian Song

నిన్ను కాపాడు దేవుడు కునుకడు నిదురపోడు – నిదురపోడు వాగ్ధానమిచ్చి మాట తప్పడు నమ్మదగినవాడు – నమ్మదగినవాడు భయమేల నీకు – దిగులేల నీకు (2) ఆదరించు యేసు దేవుడు ఉండగా ||నిన్ను కాపాడు|| శత్రు బలము నిన్ను చుట్టుముట్టినా శోధనలలో – నిన్ను నెట్టినా (2) కోడి తన పిల్లలను కాచునంతగా కాపాడు దేవుడు నీకు ఉండగా (2) ||భయమేల|| రోగ భారమందు లేవకున్ననూ వ్యాధులు నిన్ను కృంగదీసినా (2) చనిపోయిన లాజరును తిరిగి లేపిన స్వస్థపరచు దేవుడు నీకు ఉండగా (2) ||భయమేల|| --Ninnu kaapaadu devudu--
Telugu