నిరంతరం నీతోనే జీవించాలనే

Telugu Christian Song

నిరంతరం నీతోనే జీవించాలనే ఆశ నన్నిల బ్రతికించుచున్నది నాప్రాణేశ్వరా యేసయ్యా నా సర్వస్వమా. . .యేసయ్యా 1. చీకటిలో నేనున్నప్పుడు నీ వెలుగు నాపై ఉదయించెను నీలోనే నేను వెలగాలని నీ మహిమ నాలో నిలవాలని (2) పరిశుద్ధాత్మ అభిషేకముతో నన్ను నింపుచున్నావునీ రాకడకై 2. నీ రూపము నేను కోల్పోయినా నీ రక్తముతో కడిగితివి నీతోనే నేను నడవాలని నీ వలెనే నేను మారాలని (2) పరిశుద్ధాత్మ వరములతో అలంకరించుచున్నావు నీరాకడకై 3. తొలకరి వర్షపు జల్లులలో నీ పొలములోనే నాటితివి నీలోనే చిగురించాలని నీలోనే పుష్పించాలని (2) పరిశుద్ధాత్మ వర్షముతో సిద్ద పరచుచున్నావు నీరాకడకై --Nirantharam neethone jeevinchalane--
Telugu
14 views