నిరంతరమైన నీ కృపలో

Telugu Christian Song

నిరంతరమైన నీ కృపలో నే పొందుచున్న ఆనందమే అది అవధులు లేని ఆనందమే అది శాశ్వతమైన ఆనందమే (2) ||నిరంతరమైన|| అర్హతే లేని నాకు అందలము నిచ్చినావు అపవాదినెదిరించుటకు అధికారమిచ్చినావు (2) నా శక్తి కాదు దేవా – నీ ఆత్మ చేతనే నీ ఘన కార్యములు వర్ణింప శక్యమే (2) ||నిరంతరమైన|| బలహీనుడైన నన్ను బలవంతుని చేసినావు బలమైన కార్యములను బహుగా చేయించినావు (2) నా శక్తి కాదు దేవా – నీ ఆత్మ చేతనే నీ ఘన కార్యములు వర్ణింప శక్యమే (2) ||నిరంతరమైన|| మహిమా ప్రభావము నీకే చెల్లింతు మహిమోన్నతుడా మరణమైన నిన్ను విడువను నా పరుగు ముగిసేదాకా (2) నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే చావైతే అది ఎంతో మేలే (2) ||
Telugu