నిరతము స్తుతియించుము ఓ మనసా

Telugu Christian Song

నిరతము స్తుతియించుము ఓ మనసా క్రీస్తేసుని స్తుతించు (2) బాధలను తీర్చేటి ఆ స్తోత్రార్హుని కష్టాలు తొలగించే ఆ కరుణశీలుని (2) మరువక స్తుతియించుము ఓ మనసా జయగీతముతో స్తుతించు ||నిరతము|| వేదనలో విడిపించే ఆ దేవ దేవుని స్తుతియించుము ఆపదలో ఆదుకొనే ఆరాధ్య దైవమునే స్తుతియించుము (2) నిన్నిలలో ఓదార్చి తన కృపలో బలపరచే (2) ఆ నిజ స్నేహితుని కృతజ్ఞత కలిగి స్తుతియించుము – (2) ||నిరతము|| అన్ని సమయాలలో చాలిన దేవుని స్తుతియించుము పేరు జీవ గ్రంథములో వ్రాసిన గొర్రెపిల్లని స్తుతియించుము (2) నీ భారం తొలగించి తన కృపలో ఆదరించే (2) నీ ఆత్మ కాపరియైన పరిశుద్ధాత్ముని స్తుతియించుము – (2) ||నిరతము|| --Nirat
Telugu