నిత్యము స్తుతులను పాడెదనూ

Telugu Christian Song

నిత్యము స్తుతులను పాడెదనూ యేసయ్యా స్తోత్రమని నిను పొగడెదనూ యేసయ్యా ఘనుడవని ఆరాధించెదను ప్రముఖుడవని సేవించెదను వరములతో నీ వశమై - మనసారా కొలిచెదను ఫలములతో మైమరచి - హృదయముతో పూజించెదను నిత్యము స్తుతులను పాడెదనూ యేసయ్యా స్తోత్రమని నిను పొగడెదనూ యేసయ్యా |వరములతో.. 1.రకరకాల వలయాలెన్నో ఆవరించగా నీ ముందర నిలిచే ధైర్యం క్షీణించిపోయెను ప్రమాదపు అంచున నిలిచినానని వెనుకకు పిలిచావు నాకై దాచిన నీ సంకల్పం స్థిరమని తెలిపావు |వరములతో.. 2.నా దృష్టికి అందని జ్ఞానము అజ్ఞానిని చేయగా పలు శోధన మార్గములెన్నో బలహీనుని చేసెను అయినను ఓ మంచి పాత్రగా నీతో నడిపావు కృపను వెంబడి కృపను పంపి సంపూర్ణుని చేశావు |వరములతో..
Telugu