నన్ను బ్రతికించుటకు – నీవు

Telugu Christian Song

నన్ను బ్రతికించుటకు – నీవు మరణించితివే నా పాపం కడుగుటకు – నీ రక్తం కార్చితివే అయ్యా నీ త్యాగము వర్ణనాతీతము చేయనీ ధ్యానము – జీవితాంతము (2) యేసయ్యా.. యేసయ్యా.. యేసయ్యా.. యేసయ్యా… (2) ఏ నేరము చేసావని మోసావయ్యా పాప భారం ఏ ఘోరం చేసావని తీసారయ్యా నీదు ప్రాణం (2) ||యేసయ్యా|| ఏ అర్హత నాకుందని కార్చావు నీ శుద్ధ రుధిరం ఏ యోగ్యత నాకుందని చేసావు ఆ సిలువ యాగం (2) ||యేసయ్యా|| --Nannu brathikinchutaku neevu maraninchithive--
Telugu