నన్ను దిద్దుము చిన్న ప్రాయము సన్నుతుండగు నాయనా నీవు కన్న
తండ్రి వనుచు నేను నిన్ను ఁ జేరితి నాయనా ||నన్ను||
1. దూరమునకుఁ బోయి నీ దరిఁ జేర నైతిని నాయనా నేను కారు
మూర్ఖపు పిల్లనై కా రడవిఁ దిరిగితి నాయనా ||నన్ను||
2. మంచి మార్గము లేదు నాలో మరణ పాత్రుండ నాయనా నేను వంచితుండ
నైతిని ప్ర పంచమందున నాయనా ||నన్ను||
3. చాల మారులు తప్పిపోతిని మేలు గానక నాయనా నా చాల మొఱల
నాలకించుము జాలిగల నా నాయనా ||నన్ను||
4. జ్ఞాన మంతయుఁ బాడుచేసి కాన నైతిని నాయనా నీవు జ్ఞానము గల
తండ్రి వంచు జ్ఞప్తి వచ్చెను నాయనా ||నన్ను||
5. కొద్ది నరుఁడను దిద్ది నను నీ యొద్దఁ జేర్చుము నాయనా నీ యొద్దఁ
జేర్చి బుద్ధి చెప్పుము మొద్దు నైత