నన్ను ఁ గన్నయ్య రావె నా

Telugu Christian Song

నన్ను ఁ గన్నయ్య రావె నా యేసు నన్నుఁ గన్నయ్య రావె నా ప్రభువా ||నన్ను|| 1. ముందు నీ పాదారవిందము లందు నిశ్చల భక్తి ప్రేమను పొంది కగాఁ జేయ రావే నా డెంద మానంద మనంతమై యుప్పొంగ ||నన్ను|| 2. హద్దులేనట్టి దురాశల నవివేకినై కూడి యాడితి మొద్దులతో నింకఁ కూటమి వద్దయ్య వద్దయ్య వద్దయ్య తండ్రి ||నన్ను|| 3. కాలము పెక్కు గతించెను గర్వాదు లెడఁదెగ వాయెను ఈ లోక మాయ సుఖేచ్ఛలు చాలును జాలును జాలు నోతండ్రి ||నన్ను|| 4. దారుణ సంసార వారథి దరిఁ జూపి ప్రోవ నీ కన్నను కారణ గురువు లింకెవ్వరు లేరయ్య లేరయ్య లేరయ్య తండ్రి ||నన్ను|| 5. నా వంటి దుష్కరమ్మజీవినిఁ కేవల మగు నీదు పేర్మిని దీవించి రక్షింప నిప్పుడే రావయ్య రావయ్య రావ
Telugu