నను ఎడబాయక పడిపోనీయక

Telugu Christian Song

నను ఎడబాయక పడిపోనీయక పొడిగించితివి నా జీవము బ్రతికించే కదా నీ వాత్సల్యము నీకే కృతజ్ఞత స్తోత్రము దయాళుడా ఓ యేసయ్య నీ కృప నిరంతరముండును 1. నీ మంచితనము చూపించుచు కాచితివి గతకాలము నిలబెట్టగోరి శేషంగా నను రక్షించితివి ఆశ్చర్యముగను దయాళుడా ఓ యేసయ్య నీ కృప నిరంతరముండును 2. ఆటంకములను దాటించుచు చేసితివి అనుకూలము సమకూర్చి అన్ని క్షేమం కొరకును హెచ్చించితివి అనూహ్యముగను దయాళుడా ఓ యేసయ్య నీ కృప నిరంతరముండును 3. నా సంకటములో ఓదార్చుచు చూపితివి ఉపకారము నెరవేర్చి గొప్ప ఉద్దేశ్యములను దర్శించితివి ఆప్యాయముగను దయాళుడా ఓ యేసయ్య నీ కృప నిరంతరముండును నను ఎడబాయక --Nanu yedabaayaka padiponeeyaka--
Telugu