నను పిలచినవాడు నమ్మదగిన దేవుడు |2|
నను విడువడు ఎన్నడు ఎడబాయడు
తన చేతి నీడలో నను దాచును |2|
1. నా దేవుని చిత్తమనే వృత్తములో
కేంద్ర స్థానము మీద నిలుచున్నాను |2|
అందుకే నేను క్షేమమును
సౌఖ్యమును అనుభవించు చున్నాను |నను పిలచిన|
2. నా దేవుని దేహమనే సంఘములో
ఉపదేశ క్రమములో నిలుచున్నాను |2|
అందుకే నేను జయమును
ఐశ్వర్యమును అనుభవించు చున్నాను |నను పిలచిన|
3. నా పరిశుద్ధాత్ముని అభిషేకముతో
ఆత్మ అన్యోన్యతలో నిలుచున్నాను |2|
అందుకే నేను అభిషేకముతో
ఆనందించుచు పరవశ మొందుచున్నాను |నను పిలచిన|
--Nanu pilachina vadu--
--Nannu pilachinavadu--