నూతన గీతము నే పాడెదా

Telugu Christian Song

నూతన గీతము నే పాడెదా – మనోహరుడా యేసయ్యా నీవు చూపిన ప్రేమను నే మరువను – ఏస్థితిలోనైననూ సమర్పణతో సేవించెదను నిన్నే సజీవుడనై ఆరాధించెద నిన్నే కొలువుచేసి ప్రేమించినావు – కోరదగినది ఏముంది నాలో స్వార్ధ మెరుగని సాత్వీకుడా – నీకు సాటెవ్వరూ నీవే నా ప్రాణము – నిను వీడి నేనుండలేను కడలి తీరం కనబడనివేళ – కడలి కెరటాలు వేధించువేళ కరుణమూర్తిగా దిగివచ్చినా – నీకు సాటెవ్వరూ నీవేనా ధైర్యమూ – నీ కృపయే ఆధారమూ మేఘములలో నీటిని దాచి – సంద్రములలో మార్గము చూపి మంటిఘటములో మహిమాత్మ నింపిన – నీకు సాటెవ్వరూ నీవేనా విజయమూ – నీ మహిమయే నా గమ్యమూ --Noothana geethamu ne paadeda--
Telugu