పల్లవి: నూతన యెరూషలేము పట్టణము
పెండ్లికై- అలంకరింపబడుచున్నది
1. దైవనివాసము మనుషులతో- కూడా ఉన్నది
వారాయనకు – ప్రజలై యుందురు
ఆనంద – ఆనంద – ఆనందమే ||నూతన యెరూషలేము||
2. ఆదియు నేనే – అంతము నేనై యున్నాను
దుఃఖము లేదు – మరణము లేదు
ఆనంద – ఆనంద – ఆనందమే ||నూతన యెరూషలేము||
3. అసహ్యమైనది – నిషిద్ధమైనది చేయువారు
ఎవ్వరు దానిలో – లేనేలేరు
ఆనంద – ఆనంద – ఆనందమే ||నూతన యెరూషలేము||
4. దేవుని దాసులు – ఆయనను సేవించుదురు
ముఖ దర్శనము – చేయుచునుందురు
ఆనంద – ఆనంద – ఆనందమే ||నూతన యెరూషలేము||
5. సీయోనులో – గొర్రెపిల్లయే మూలరాయి
సీయోను పర్వతము – మీదయు ఆయనే
ఆనంద – ఆనంద – ఆనందమే ||నూతన యెరూషలేము||