ఓ దేవా నా యాత్రలోన

Telugu Christian Song

ఓ దేవా నా యాత్రలోన - నా తోడు నీవేనయా -2 నా నీడవై - నను వీడక - నడిపించు నా దేవా - 2 1. దుప్పి నీటి - వాగుల కొరకు - ఆశపడునట్లుగా దేవా నీకొరకు - నా ప్రాణం - ఆశ పడుచున్నది = 2 నిత్యము నీ వాక్యమందు నిలిపి - నీ కృపలో నను గావుమా - 2 2. క్రమములేని నా బ్రతుకంతా - శ్రమలపాలైపోగా కరుణ చూపి - నన్ను నీవు - వెలుగుతారగా చేసావు = 2 కడవరకు నీ ఆజ్ఞలందు నిలిపి - నీ కృపలో నను గావుమా - 2 --Oo deva naa yatralona naa thodu--
Telugu