ఓ నీతి సూర్యుడా

Telugu Christian Song

ఓ నీతి సూర్యుడా - క్రీస్తేసు నాథుడా నీ దివ్య కాంతిని - నాలో వుదయింప జేయుమా ప్రభూ నన్ను వెలిగించుమా .. ఓ నీతి.. 1. నేనే లోకానికి - వెలుగై యున్నానని మీరు లోకానికి - వెలుగై యుండాలని ఆదేశమిచ్చినావుగావున - నాలో వుదయించుమా ప్రభూ నన్ను వెలిగించుమా .. ఓ నీతి.. 2. నా జీవితమునే - తూకంబు వేసిన నీ నీతి త్రాసులో - సరితూగ బోనని నే నెరిగియింటిగావున - నాలో వుదయించుమా ప్రభూ నన్ను వెలిగించుమా .. ఓ నీతి.. --Oo neethi sooryuda kreesthesu naadhuda--
Telugu
1 views