ఓ సంఘమా సర్వాంగమా

Telugu Christian Song

ఓ సంఘమా సర్వాంగమా – పరలోక రాజ్యపు ప్రతిబింబమా యేసయ్యను ఎదుర్కొనగ – నీతి నలంకరించి సిద్ధపడుమా ఓ సంఘమా వినుమా రాణి ఓఫిరు అపరంజితో – స్వర్ణ వివర్ణ వస్త్ర ధారణతో వీణ వాయిద్య తరంగాలతో – ప్రాణేశ్వరుని ప్రసన్నతతో ఆనంద తైల సుగంధాభిషేకము (2) పొందితినే యేసునందు (2) ||ఓ సంఘమా|| క్రీస్తే నిన్ను ప్రేమించెనని – తన ప్రాణ మర్పించెనని స్వస్థపరచె నిర్దోషముగా – ముడత కళంకము లేనిదిగ మహిమా యుక్తంబుగా నిలువ గోరె యేసుడు (2) సహియింతువా తీర్పునాడు (2) ||ఓ సంఘమా|| చీకటిలో నుండి వెలుగునకు – లోకములో నుండి వెలుపలకు శ్రీకర గుణాతిశయములను – ప్రకటించుటకే పిలిచెనని గుర్తించుచుంటివా క్రియలను గంటివా (2) సజీవముగా నున్నావా (2) |
Telugu