ఒక క్షణమైనా నిన్ను వీడి

Telugu Christian Song

ఒక క్షణమైనా నిన్ను వీడి ఉండలేనయ్య నా యేసయ్యా (2) యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా (2) ||ఒక క్షణమైనా|| నశియించిపోతున్న నన్ను బ్రతికించినావయ్యా యేసు కృశించిపోతున్న నాలో వేంచేసినావయ్యా యేసు (2) నీ కార్యములెంతో ఆశ్చర్యకరములయ్యా నీ వాగ్దానములెంతో నమ్మదగినవయ్యా ||యేసయ్యా|| మతిలేక తిరిగిన నన్ను నీ దరి చేర్చినావయ్యా యేసు శ్రమ చేత నలిగిన నాకు వరమిచ్చినావయ్యా యేసు (2) నీ ఆలోచనలెంతో లోతైన దీవెనయ్యా నీ తలపులు ఎంతో మధురము నా యేసయ్యా ||యేసయ్యా|| --Oka kshanamaina ninnu veedi undalenayya--
Telugu