ఒకని తల్లి ఆదరించునట్లు

Telugu Christian Song

ఒకని తల్లి ఆదరించునట్లు నను ఆదరించిన నా దేవుడు (2) హీనుడనైనా బలహీనుడనైనా కురూపినైనా కఠినుడనైనా (2) ||ఒకని|| 1.ఒకసారి నేను నీ మందనుండి నే తప్పిపోయిన వేళ (2) నను వెదకితివయ్యా కాపాడితివయ్యా (2) నీ చంకపెట్టితివా యేసయ్యా (2) ||ఒకని|| 2.నీ సన్నిధినుండి నే దూరమవగా చిక్కాను దొంగ చేతిలోన (2) నను దోచిపోగా నను దాటిపోగా (2) బ్రతికింప వచ్చితివా యేసయ్యా (2) ||ఒకని|| --Okani thalli aadarinchunatlu--
Telugu