పల్లవి: ఒకసారి ఆలోచించవా.. ఓ సోదరా
ఒకసారి అవలోకించవా.. ఓ సోదరీ (2X)
నీ జీవిత మూలమేదో - నీ బ్రతుకు ఆధారమేదో (2X) |ఒకసారి…
1. తండ్రి యెహోవా తన్ను పోలి - నిను చేసెను తన వూపిరిలో (2X)
నా వలెనే నీవు పరిశుద్దముగ - జీవించమని కోరెను |నీ జీవిత… .
2. దేవుని వదలి దుష్టుని కూడి - లోకము తట్టు మరలి (2X)
లోక మాయ సంకెళ్ళలో చిక్కి దురాశలలొ అణగారితివా |నీ జీవిత…
3. లోకము వీడు యేసయ్యన్ చూడు - నిత్య జీవముకై పరుగిడు (2X)
నేనే మార్గము, సత్యము, జీవమని సెలవిచ్చెను మన మెస్సయ్యా |నీ జీవిత…
--Okasaari aalochinchava oo sodara--