ఒంటరి పయనంలో ఎవరు

Telugu Christian Song

ఒంటరి పయనంలో ఎవరు లేకున్నా అందరు నను విడిచి దూరంపోతున్నా నీవే తోడుండగా నీ సన్నిధి వెంటుండగా ఈ పయనం ఆగనే ఆగదు యేసు నా అడుగు జారనే జారదు ఎడారిలో గూడబాతునై రెక్కలు తెగిన పక్షినై దారే కానరాకున్న గమ్యమే తెలియకున్నా ఈ పయనం ఆగనే ఆగదు యేసు నా అడుగు జారనే జారదు దప్పికతో నీటివాగుకై పరుగెడుతున్న దుప్పికై ఆశే ఇకలేకున్నా ధైర్యమే మిగులకున్నా ఈ పయనం ఆగనే ఆగదు యేసు నా అడుగు జారనే జారదు ఓటమితో వట్టి మోడునై ఫలములులేని చెట్టునై శ్వాసే ఆగిపోతున్నా ప్రాణమే మిగులకున్నా ఈ పయనం ఆగనే ఆగదు యేసు నా అడుగు జారనే జారదు --Ontari payanamlo yevaru lekunna--
Telugu