ఒంటరిని నేను ఒంటరిని

Telugu Christian Song

ఒంటరిని నేను ఒంటరిని ఓడిపోయి నేను ఒంటరినై ఓదార్పులేక ఓరిమిలేక మరణమే ఇక శరణం అనుచు అంతమవ్వాలని ఆశపడితి || ఒంటరిని || 1. దావీదు వలె నేను శ్రమలనొందుచు నిందకు వేదనకు వేడుకనైతిని ఒంటరినై నేను నిను వెదకుచుండగా నీ వాక్యముచే నను ఆదరించి ఇదిగో నేను ఉన్నాను అని నీవు అభయము ఇచ్చితివి యేసు దేవా! || ఒంటరిని || 2. తప్పిపోయిన తనయుని వలె నేను తండ్రికి దూరమై ఒంటరినైతిని తప్పు తెలిసి క్షమీయించుమని నీ చెంతకు నే చేరితి తండ్రి నీవు నన్ను కౌగిలించి క్షమియించిన ఓ కరుణామయుడా! || ఒంటరిని || 3. యాకోబు వలె నేను భయముతో వణకుచు ఒంటరినై నీతో పోరాడుచుండగా పేరు పెట్టి పిలిచినా దేవా నీదు మోమును చూపించితివి భయపడక నీవు సాగిపొమ
Telugu