ఊహించలేని మేలులతో నింపిన

Telugu Christian Song

ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా నీకే నా వందనం ||2|| వర్ణించగలనా నీ కార్యముల్ వివరించగలనా నీ మేలులన్ ||2|| ||ఊహించలేని|| మేలుతో నా హృదయం తృప్తిపరచినావు రక్షణ పాత్రనిచ్చి నిను స్తుతియింతును ||2|| ఇశ్రాయేలు దేవుడా నా రక్షకా స్తుతియింతును నీ నామమున్ ||2|| ||ఊహించలేని|| నా దీనస్థితిని నీవు మార్చినావు నా జీవితానికి విలువనిచ్చినావు ||2|| నీ కృపకు నన్ను ఆహ్వానించినావు నీ సన్నిధి నాకు తోడునిచ్చినావు ||2|| ||ఊహించలేని|| --Oohinchaleni melulatho nimpina--
Telugu