ఊహించలేను నీ ప్రేమను నా ఊహ చాలదయ
వర్ణించలేను నీ మేలులు వర్ణనకందవయా
నా తల్లిలా నా యెడల
ప్రేమను చూపితివే
నాతండ్రిలా నాపక్షమై విజయమునిచ్చితివే
ఎన్నడైనా ఎడబాయక నను నడిపించితివే
వేదనలో నేనుండగా – చేతులుచాపి పిలచిన దేవ
ఆప్యాయతగా పలుకరించి కౌగిటిలో నను దాచితివయ్య
నా భారమంతా నీవే మోసినావు
నా కన్నీటిని నీవే తుడిచినావు
నాదేవ నీ కృపకు నేను పాత్రుడనా…..
దీనతలో దైర్యమునిచ్చి బలము నొసగిన
నా యేసయ్య
ఆత్మీయుడవై నా పక్షమై ధ్వజముగా
నీవు నిలిచితివయ్య
యోగ్యత లేకున్నా ఎన్నడు విడువక
ప్రతీ క్షణము నాతోనే ఉంటివే
నా దేవా నీ కృపకు నేను పాత్రుడనా…..
--Oohinchalenu nee premanu naa ooha chaaladu--