ఊహించలేనయ్యా వివరించలేనయ్యా

Telugu Christian Song

ఊహించలేనయ్యా వివరించలేనయ్యా ఎనలేని నీ ప్రేమను (2) నా జీవితాంతం ఆ ప్రేమలోనే (2) తరియించు వరమే దొరికెను (2)||ఊహించ|| 1.నా మనసు వేదనలో – నాకున్న శోధనలో ఉల్లాసమే పంచెను ఓ మధుర భావనలో – తుదిలేని లాలనలో మధురామృతమునే నింపెను (2) అనాథయిన నను వెదకెను ప్రధానులలో ఉంచెను (2)||ఊహించ|| 2.నీ మరణ వేదనలో – నీ సిలువ శోధనలో నీ ప్రేమ రుజువై నిలిచెను వెలలేని త్యాగముతో – అనురాగ బోధలతో నా హృదయమే కరిగెను (2) ఇది నీ ప్రేమకే సాధ్యము వివరించుట నాకసాధ్యము (2) ||ఊహించ|| --Oohinchalenayya vivarinchalenayya--
Telugu