ఊహకందని ప్రేమలోన భావమే నీవు
హృదయమందు పరవసించు గానమే నీవు
మనసు నిండిన రమ్యమైన గమ్యమే నీవు
మరపురాని కలల సౌధం గురుతులే నీవు
ఎడబాయలేనన్నా నిజస్నేహమే నీవు
నీ ప్రేమ కౌగిలిలో ఆనందమే నీవు ( ఊహకందని )
1. తల్లడిల్లే తల్లి కన్నా మించి ప్రేమించి
తనువుతీరే వరకు నన్ను విడువలేనంది (2)
అదియే.. నే గాయపరచిన వేళలో
కన్నీరు కార్చిన ప్రేమగా
నులివెచ్చనైన ఒడికి చేర్చి ఆదరించిన ప్రేమయే
నీ గుండెలో నను చేర్చిన నీ అమరమైన ప్రేమయే (2) ( ఊహకందని )
2. నింగి నేలను కలిపిన బలమైన వారధిగా
నేలకొరిగిన జీవితాన్ని లేవనెత్తెనుగా (2)
అదియే.. తన మహిమ విడిచిన త్యాగము
ఈ భువికి వచ్చిన భాగ్యము
నను దాటిపోక వెదకిన నీ మధురమై