ప్రాణమా నా ప్రాణమా

Telugu Christian Song

ప్రాణమా నా ప్రాణమా ప్రియ యెహోవాను సన్నుతించుమా ప్రియ యెహోవా చేసిన మేలులను నీవు ఎన్నడు మరువకుమా ||ప్రాణమా|| గత కాలములన్నిటిలో కృపతోనే నడిపించెను (2) కరుణ కటాక్షమనే (2) కిరీటం నీకు దయచేసెను (2) ||ప్రాణమా|| నిను విడువక ఎడబాయక నిత్యం నీకు తోడైయుండెను (2) నీవు నడిచిన మార్గములో (2) నీకు దీపమై నిలచెనుగా (2) ||ప్రాణమా|| పాప శాపము వ్యాధులను పారద్రోలియే దీవించెను (2) పరిశుద్ధుడు పరమ తండ్రి (2) బలపరిచెను తన కృపతో (2) ||ప్రాణమా|| మహా ఆనంద మానందమే మహారాజా నీ సన్నిధిలో (2) మహిమగల మహారాజా (2) మనసారా స్తుతించెదను (2) ||ప్రాణమా|| --Pranamaa naa pranamaa--
Telugu