ప్రార్ధన వినెడి పావనుడా - ప్రార్ధన మాకు నేర్పుమయా |ప్రార్ధన..
1. శ్రేష్ఠమైన భావము గూర్చి - శిష్యబృందముకు నేర్పితివి
పరముడ నిన్ను – ప్రణుతించెదము – పరలోక ప్రార్ధన నేర్పుమయా |ప్రార్ధన..
2. పరమ దేవుడవని తెలిసి - కరము లెత్తి జంటగ మోడ్చి
శిరమును వంచి సరిగమ వేడిన - సుంకరి ప్రార్ధన నేర్పుమయా |ప్రార్ధన..
3. దినదినంబు చేసిన సేవ - దైవ చిత్తముకు సరిపోవ
దీనుడవయ్యు దిటముగ కొండను - చేసిన ప్రార్ధన నేర్పుమయా |ప్రార్ధన..
4. శత్రుమూక నిను చుట్టుకొని - సిలువపై నిను జంపగను
శాంతముతో నీ - శత్రుల బ్రోవగ - సలిపిన ప్రార్ధన నేర్పుమయా |ప్రార్ధన..
--Prardhana vinedi paavanuda prardhana maaku--