ప్రార్ధనలోనే గడుపుటయే నాకెంతో

Telugu Christian Song

ప్రార్ధనలోనే గడుపుటయే నాకెంతో భాగ్యము యేసుతోనే సహవాసం చేసెదను నిత్యము ||ప్రార్ధన|| 1.ప్రార్ధనలో వాక్యమును - దొరకగా భుజించెదం క్రీస్తు మనకై చేసిన కార్యములన్ని పొగడెదము (2) ప్రార్ధనలో స్తుతియించి స్తోత్రించి పాడెదం దేవుని ప్రేమను గూర్చి కృతజ్ఞత చెల్లింతం ||ప్రార్ధన|| 2.ప్రార్ధనలో నిరీక్షించి కనిపెట్టెద చిత్తం దేవుని ఇష్టులుగా నడచి సంతోష పరచెదం ||ప్రార్ధన|| 3.ప్రార్ధనలో జయములను సాధించి చూపెదం ప్రార్ధనచే సమస్తము జరిగించి సాగెదం ||ప్రార్ధన|| 4.ప్రార్ధించే వారము - పాపము చేయక వుండెదం ప్రార్ధననే ఊపిరిగా కలిగి జీవించెదం ||ప్రార్ధన|| --Prardhana lone gaduputaye neekentho--
Telugu