ప్రభు మొర వినవా

Telugu Christian Song

ప్రభు మొర వినవా ప్రభు మొర వినవా నీ కొరకే నేను వెదకేను దేవా నాకొకసారి కనిపించ రావా – (2) ||ప్రభు|| నాదు ప్రాణము తల్లడిల్లాగా భూదిగంతముల నుండియేగా (2) మొఱ్ఱ పెట్టుచుంటి నీకేగా (2) ||నీ కొరకే|| ఎక్కలేని ఎత్తైన కొండ ఎక్కించుము నను పరిశుద్ధ కొండ (2) చక్కని ప్రభు నీ మోము జూడ (2) ||నీ కొరకే|| మిత్రుడా నా ఆశ్రయ నీవే శత్రువుల యెడ నా కోట నీవే (2) స్తుతికి కారణభూతుడా నీవే (2) ||నీ కొరకే|| --Prabhu mora vinavaa--
Telugu