ప్రభుని గృహము ఆయన మహిమతో

Telugu Christian Song

ప్రభుని గృహము ఆయన మహిమతో పరిపూర్ణముగా నిండెను (2) అపరాధములచే ప్రజలందరును దేవుని మహిమను కోల్పోయిరి (2) తన మహిమను మన కిచ్చుటకు (2) యేసు ప్రభువే బలి యాయెన్ (2) ||ప్రభుని|| కృపా సత్యములు సంపూర్ణముగా మన మధ్యలో వసించెను (2) తండ్రి మహిమను తన సుతునిలో (2) మనమందరము చూచితిమి (2) ||ప్రభుని|| ప్రభువు యింటిని నిర్మించు చుండె సజీవమైన రాళ్ళతో (2) ఆయన మహిమ దానియందుండ (2) తన సంకల్పమై యున్నది (2) ||ప్రభుని|| శాంతిరాజు యిల్లు కట్టుచున్నాడు మానవ హస్తము అందుండదు (2) క్రయమునిచ్చి స్థలముకొనెను (2) తాను కోరిన స్థలమదే (2) ||ప్రభుని|| ప్రత్యేకపరచిన ఆత్మీయ యింటికి తన పునాదిని వేసెను (2)
Telugu