ప్రభువా నీలో జీవించుట

Telugu Christian Song

ప్రభువా నీలో జీవించుట కృపా బాహుల్యమే నా యెడ కృపా బాహుల్యమే ||ప్రభువా|| 1. సంగీతములాయె పెను తుఫానులన్నియు (2) సమసిపోవునే నీ నామ స్మరణలో (2) సంతసమొందె నా మది యెంతో (2) ||ప్రభువా|| 2. పాప నియమమును బహు దూరముగా చేసి (2) పావన ఆత్మతో పరిపూర్ణమైన (2) పాద పద్మము హత్తుకొనెదను (2) ||ప్రభువా|| 3. నీలో దాగినది కృప సర్వోన్నతముగా (2) నీలో నిలిచి కృపలనుభవించి (2) నీతోనే యుగయుగములు నిల్చెద (2) ||ప్రభువా|| 4. నూతన వధువునై శుద్ధ వస్త్రములు ధరించి (2) నూతనమైన శుభాకాంక్షలతో (2) నూతన షాలేమై సిద్దమౌదు నీకై (2) ||ప్రభువా|| --Prabhuva neelo jeevinchuta--
Telugu
1 views