ప్రభువా పంపు వర్షమును

Telugu Christian Song

ప్రభువా పంపు వర్షమును నీ వాగ్దానములు స్థిరపరచి భీకర ధ్వనితో రానిమ్ము 1. ఏలియా మొరపెట్టగానే మేఘములు కారుగమ్మెను మోపైన వాన - భువిపైన గురిసే మా దీన ప్రార్థన వినుమా 2. కడవరి వాన కాలమున వర్షము దయ చేయు మిలలో పైరు మొలుచునట్లు ప్రతి చేని లోను మెరుపులను పుట్టించుము 3. దేవా! నీ స్వాస్థ్యము మీద సమృద్ధిగా కురిపించుము దాహముతోను - దస్సిన మమ్ము బలపరచి స్థిరపరచుము 4. ఆత్మీయ గొడ్డుతనములో నలమటించుచున్న మాకు ఉపదేశమిచ్చి పరిశుద్ధ పరచి ఉజ్జీవింప జేయు మమ్ము 5. మా నోట నగ్ని తగిలించి మా దోషమంతా తొలగించి పంపుము దేవా - నిను సేవించుటకు ప్రాపుగ ప్రకటింపనిమ్ము --Prabhuva pampu varshamunu--
Telugu