ప్రభువా పరలోక - జీవాగ్ని

Telugu Christian Song

ప్రభువా పరలోక - జీవాగ్ని నిమ్ము పరిపూర్ణముగా - జీవము నిమ్ము పావనాత్మాగ్నిని - నాలో జ్వలింపగ పరిశుద్ధ జీవము - పూర్తిగ నిమ్ము 1. నిను హృదయంబార - ప్రేమించునట్లు నింపుము నా మది - ప్రేమాగ్నితో సర్వము హృదయము - కాయము నిచ్చెద స్వర్గీయ జీవ సమృద్ధి నిమ్ము 2. యేసు స్తుతి నే పాడునట్లు ఆశనొసగుము - నా హృదయములో నన్నుండి జీవము - ప్రవహించునట్లు నీలో సంతృప్తిగ త్రాగెదను 3. ప్రశస్తరక్తమున - కడుగుము పాప మృత్యువు నుండి విడిపించుము సింహాసనం నాలో స్థాపించి వాగ్దానము నెరవేర్చుము నాలో --Prabhuva paraloka jeevaagni--
Telugu