ప్రియయేసు నిర్మించితివి – ప్రియమార

Telugu Christian Song

ప్రియయేసు నిర్మించితివి – ప్రియమార నా హృదయం ముదమార వసియించు నా – హృదయాంతరంగమున 1. నీ రక్త ప్రభావమున – నా రోత హృదయంబును పవిత్రపరచుము తండ్రీ – ప్రతిపాపమును కడిగి 2. అజాగరూకుడనైతి – నిజాశ్రయము విడచి కరుణారసముతో నాకై – కనిపెట్టితివి తండ్రీ 3. వికసించె విశ్వాసంబు – వాక్యంబును చదువగనె చేరితి నీదు దారి – కోరి నడిపించుము 4. ప్రతిచోట నీ సాక్షిగా – ప్రభువా నేనుండునట్లు ఆత్మాభిషేకము నిమ్ము – ఆత్మీయ రూపుండా --Priya yesu nirminchithivi priyamaara--
Telugu