ప్రజలమే వేగమె రారె

Telugu Christian Song

ప్రజలమే వేగమె రారె నిజదైవమును కనుగొనరె|| 1. పాపాత్ములనబడు వారి భారంబు దీయనుగోరి ప్రభుయేసు జూపినదారి పరమందు సుఖమిడుదారి ||ప్రజ|| 2. ఏ జాతివారలనైనన్ యే దేశవాసులనైనన్ యేమైన బేధము లేక యేసయ్య బ్రోచునువేగ ||ప్రజ|| 3. పాపాత్ములే తన సుతులు ప్రభు యేసునికి స్నేహితులు నీ పాపమెల్లను బోయెన్ నీకింక మోక్షము కలుగున్ ||ప్రజ|| 4. ప్రయాసపడి భారమును మోసెడు ఓ ప్రజలారా ప్రభుయేసుక్రీస్తే మీకు విశ్రాంతి నిచ్చునురండి ||ప్రజ|| 5. యేసయ్యగాకను వేరే యెవరైన లేరిక రారే దోషంబులలెల్నను బాపి ఆశీర్వదించునుగాచి ||ప్రజ|| --Prajalame vegame raare--
Telugu