ప్రవహించుచున్నది ప్రభు యేసు రక్తం
పాపములన్నియు కడుగుచున్నది
పరమతండ్రితో సమాధానము కలిగించుచున్నది
1. దుర్ణీతి నుండి విడుదలచేసి
నీతిమార్గాన నిను నడిపించును
యేసురక్తము క్రయధనమగును
నీవు ఆయన స్వస్థమౌదువు || ప్రవహించుచున్నది ||
2. దురభిమానాలు దూరముచేసి
యథార్థ జీవితం నీకనుగ్రహించును
యేసురక్తము నిర్దోషమైనది
నీవు ఆయన ఎదుటే నిలిచెదవు || ప్రవహించుచున్నది ||
3. జీవజలముల నది తీరమున
సకలప్రాణులు బ్రతుకుచున్నవి
యేసురక్తము జీవింపజేయును
నీవు ఆయన వారసత్వము పొందెదవు || ప్రవహించుచున్నది ||
--Pravahinchuchunnadi prabhu yesu rakthamu--