పాపి కాశ్రయుఁడవు నీవే

Telugu Christian Song

పాపి కాశ్రయుఁడవు నీవే యేసు నీవే 1. ఉన్నత లోకము విడిచిన నీవే కన్నియ గర్భమునఁ బుట్టిన నీవే యేసు నీవే ||పాపి|| 2. అజ్ఞాన నాశన బ్రధ్నుఁడవు నీవే విజ్ఞాన దాయక పరగురువు నీవే యేసు నీవే ||పాపి|| 3. చెదరిన పాపుల వెదకెడు నీవే చెదరిన గొఱ్ఱెల కాపరివి నీవే యేసు నీవే ||పాపి|| 4. రోగిష్ఠులకు స్వస్థ ప్రదుఁడవు నీవే మ్రోగు నార్తుల యొక్క మొఱవిను నీవే యేసు నీవే ||పాపి|| 5. నర పుత్రులకు నీతిఁ గరపించు నీవే కరము చాఁపి కష్టములు ద్రోయు నీవే యేసు నీవే ||పాపి|| 6. శాత్రవాంతరమున మృతుఁడవు నీవే మైత్రిఁ జూపఁగ మృత్యుద్ధతుఁడవు నీవే యేసు నీవే ||పాపి|| 7. భవ దీయ పదకంజ దాసుండ నేనే భవ మగ్ను నను ముక్తుఁ జేయుము నీవే యేసు నీవే
Telugu