పలుకలేని నాకు పాట నేర్పినావు

Telugu Christian Song

పలుకలేని నాకు పాట నేర్పినావు చేతకాని నన్ను నీవే ఎన్నుకున్నావు మనిషిగా మలచావు – ప్రేమతో పిలిచావు (2) యేసయ్యా స్తోత్రమయా యేసయ్యా స్తోత్రమయా ||పలుకలేని|| కోడి తన రెక్కల క్రింద దాచినట్లు దాచినావు నా తల్లి మరచినా నేను మరువనన్నావు (2) ప్రతి ఉదయం వేకువనే ఎదురు చూచు ప్రియుడవు నీవు (2) ప్రతి క్షణము కాపరివై కాయుచున్న దేవుడ నీవు (2) ||యేసయ్యా|| అగాధ జలములు సైతం ఆర్పలేని ప్రేమ నీది వెండి బంగారు కన్నా విలువైన ప్రేమ నీది (2) ప్రతి పగలు మేఘమై నీడనిచ్చుఁ దేవుడ నీవు (2) ప్రతి రాత్రి దీపమై వెలుగునిచ్చుఁ దేవుడ నీవు (2) ||యేసయ్యా|| --Palukaleni naaku paata nerpinavu--
Telugu