పొద్దుగూకె బెత్లేములో
ఊరు వాడా తార వెలుగులో
గొల్లాలేమో పాటల సందడిలో
గాబ్రీయేలు దూత వచ్చెరో
లోకమంతా రక్షణ వార్తరో
కన్నె మరియ శిశువును కన్నదిరో
ఆ శిశువేగా నీకు నాకు రక్షకుడు
ఆ యేసేగా మన అందరికి రక్షకుడు
పశువుల పాకలో నిద్దురపోయె – జ్ఞానులకు మిక్కిలి పూజితుడాయె
బంగారు సాంబ్రాణి బోళముతో – సాగిలపడి నమస్కరించిరాయె
సర్వ దూతలు స్తోత్రము పాడిరి – మనసారా గొల్లలు ఆడిరి
లోకమంతా సంబరమాయె ఈ వేళ
ఇక జగమంతా చీకటి కానరాదంట
మన బ్రతుకుల్లో సంతోషం నిండెనంట
మదిలోన క్రీస్తుకు నీవు చోటిస్తే – ఆయనకు నీ హృదయం అర్పిస్తే
మనసున నీ ప్రతిపాపం వదిలేస్తే – ప్రభువునకు ఇష్టునిగా నీవుంటే
నీ జీవితాన యేసు పుట్టునులే
నీ బ్రతుకు నూ