పరిమళ తైలము నీవే - తరగని సంతోషం నీలో
జీవ మకరందం నీవే - తియ్యని సంగీతం నీవే
తరతరములలో నీవే - నిత్య సంకల్ప సారథి నీవే
జగముల నేలే రాజా - నా ప్రేమకు హేతువు నీవే
1. ఉరుముచున్న మెరుపుల వంటి
తరుముచున్న శోధనలో (2)
నేనున్నా నీతో అంటూ - నీవే నాతో నిలిచావు
క్షణమైనా విడువక ఔదార్యమును నాపై చూపినావు
నీ మనసే అతి మధురం - అది నా సొంతమే " పరిమళ "
2. చీల్చబడిన బండ నుండి - నా కొదువ తీర్చి నడిపితివి
నిలువరమగు ఆత్మ శక్తి తో - కొరత లేని ఫలములతో
నను నీ రాజ్యమునకు పాత్రుని చేయ ఏర్పరచుకుంటివి
నీ స్వాస్థ్యము లోనే చేరుటకై అభిషేకించినావు
నీ మహిమార్థం వాడ బడే నీ పాత్రను నేను