పరమ జీవము నాకు

Telugu Christian Song

పరమ జీవము నాకు నివ్వ - తిరిగి లేచెను నాతో నుండ నిరంతరము నన్ను నడిపించును - మరల వచ్చి యేసు కొని పోవును యేసు చాలును - యేసు చాలును యే సమయమైన యే స్థితికైన నా జీవితములో యేసు చాలును 1. సాతాను శోధనలధికమైన - సొమ్మసిల్లక సాగి వెళ్ళదను లోకము శరీరము లాగినను - లోబడక నేను వెళ్ళదను |యేసు.. 2. పచ్చిక బయలులో పరుండజేయున్ - శాంతి జలము చెంత నడిపించును అనిశము ప్రాణము తృప్తిపరచున్ - మరణ లోయలో నన్ను కాపాడును |యేసు.. 3. నరులెల్లరు నన్ను విడిచినను - శరీరము కుళ్ళి కృశించినను హరిన్చినన్ నా ఐశ్వర్యము - విరోధివలె నన్ను విడచినను |యేసు.. --Parama jeevamu naaku nivva--
Telugu