పరమున ప్రభువా వరముల నడుగ
నే వెదకితిని నీ పాదములనే
1.ధనధాన్యములు సర్వసంపదలు
సర్వ సుఖములు నిను కోరలేదు
నీ ప్రేమ నీ కరుణ నీ కృపయే చాలు
నిను గాక నేనేది మరి కోరలేదు (2) ||పరమున||
2.ఇలలోన నా యాత్రను ముగిసి
పరలోకమును నే చేరువేళ
వేవేల దూతలు గీతాలు పాడ
నీపాద కమలాల నను ఒదిగిపోని (2) ||పరమున||
--Paramuna prabhuvaa varamula--