పరిశుద్ధాత్ముఁడ దేవ! ప్రభువా నీ

Telugu Christian Song

పరిశుద్ధాత్ముఁడ దేవ! ప్రభువా నీ కరుణ మా పైన వర్షించు మయ్య వరుఁడా నీ భక్తుల మనముల నాత్మల బలపర్చి రక్షించి మరి స్వస్తి నిడు మయ్య ||పరి|| 1. బలమౌ నీ వెలుఁగుచే బలు దేవ భాషల ప్రజల కందర కైక్యముఁ గలిగించి విశ్వాస మున వారి నొనఁగూర్చి వెలయుచుండెడు నీకే విన తుల్ సల్పుదు మయ్య ||పరి|| 2. బలమౌ దుర్గమా మిగుల పావనంబగు వెలుఁగా! ప్రభువా దేవుని జ్ఞానము కలిగించి మదితోడఁ బిలువఁ దండ్రీ యంచు వెలుగు సత్య మునౌ నీ బల వాక్య మిడు మాకుఁ ||పరి|| 3. విపరీత బోధలను వేరౌ బోధకులను విడువ మా కిడు సాయము కృప నొప్పు యేసే మా గురు వంచు మది నమ్మి యపనమ్మికను మాని యవనిం బ్రతుక నిమ్ము ||పరి|| 4. పరిశుద్ధతకు నూటా నెర నెమ్మదికి కర్త
Telugu