పరిశుద్ధ ఆత్మా రమ్ము నా హృదయములోనికి

Telugu Christian Song

పరిశుద్ధ ఆత్మా రమ్ము నా హృదయములోనికి నన్ను నింపుము నీ శక్తితో సామర్థ్యముతో (2) నీ అగ్ని నా లోపల రగులుగాక నీ ప్రేమ నా హృదయము నింపుగాక (2) ఆత్మా ఆత్మా పరిశుద్ధ ఆత్మా నా జీవితము నీకే అర్పింతును ఆత్మా ఆత్మా దేవుని ఆత్మా నా సేవ నీకే అంకితము చేతును (2) ||పరిశుద్ధ|| నీ ఫలములు నాలో కనబడుగాక ప్రేమ సంతోషము శాంతి చూపుగాక (2) దీర్ఘశాంతము దయ మంచితనము విశ్వాసము సాత్వికత నాలో వికసించుగాక (2) ||పరిశుద్ధ|| నీ వరములతో నన్ను అలంకరింపుము నీ సామర్థ్యముతో నన్ను బలపరచుము (2) సాక్షిగా సువార్త వ్యాప్తికై నన్ను ఉపయోగించుకొనుము ప్రభువా (2) ||పరిశుద్ధ|| --Parishudda aathma rammu naa hrudayamuloni
Traditional
Telugu