పరిశుద్ధుడవై మహిమప్రభావములకు - నీవే పాత్రుడవు
బలవంతుడవై - దీనుల పక్షమై కృప చూపువాడవు
దయాలుడవై ధారాలముగా నను దీవించిన శ్రీమంతుడా
ఆరాధన నీకే నా యేసయ్య -2
1. నీ స్వాస్థ్యమైన నీవారితో కలిసి - నిను సేవించుటకు
నీ మహిమ ప్రభావమును - కిరీటముగా - ధరింపజేసితివి.
శాశ్వత కాలము వరకు నీ సంగతిపై దృష్టి నిలిపి
నీ దాసుల ప్రార్ధనలు సఫలపరచితివి. |"ఆరాధన"
2. నీనిత్యమైన ఆదరణ చూపి నను స్థిరపరచుటకు
నీ కరుణకటాక్షమును నాపై కురిపించి నను ప్రేమించితివి
నాకు ప్రయోజనము కలుగజేయుటకు నీ ఉపదేశమును బోధించి
నీ దాసుని ప్రాణమును సంతోషపరచితివి. |"ఆరాధన"
3. ఆనందకరమైన దేశములో నేను - నిను ఘనప