ప్రార్థన వినెడి పావనుడా

Telugu Christian Song

ప్రార్థన వినెడి పావనుడా ప్రార్థన మాకు నేర్పుమయా ||ప్రార్థన|| 1. శ్రేష్టమైన భావము గూర్చి శిష్య బృందముకు నేర్పితివి పరముడ నిన్ను ప్రణుతించెదము పరలోక ప్రార్థన నేర్పుమయ్యా ||ప్రార్థన|| 2. పరమ దేవుడవని తెలిసి కరము లెత్తి జంటగ మోడ్చి శిరమునువంచి సరిగను వేడిన సుంకరి ప్రార్థన నేర్పుమయా ||ప్రార్థన|| 3. దినదినంబు చేసిన సేవ దైవ చిత్తముకు సరిపోవ దీనుడవయ్యు దిటముగ కొండను చేసిన ప్రార్థన నేర్పుమయా ||ప్రార్థన|| 4. శత్రుమూక నిను చుట్టుకొని సిలువపైని నిను జంపగను శాంతముతో నీ శత్రుల బ్రోవగ సలిపిన ప్రార్థన నేర్పుమయా ||ప్రార్థన|| --Prardhana vinedi paavanuda--
Telugu