ప్రేమాంబుధి కృపానిధి నడిపించుసారధి
నీ ప్రేమయే నా ధ్యానము
నీ స్నేహమే నా ప్రాణము
నీవే నా గానమూ
1. ఎదుట నిలిచి నీవు ఉంటే భయములేదిక
ఎండమావి నీరు చూసి మోసపోనిక
సాగిపోయే నీడచూచి – కలత చెందక
నీకై జీవించెద | ప్రేమా॥
2. సంద్రమందు అలలపిలె అలసిపోనిక
ధరణిలోని ధనము చూసి ఆశచెందక
భారమైన జీవితాన్ని సెదదీర్దిన
నీ ప్రేమ పొందెద || ప్రేమా॥
--Premambuddi krupanidhi nadipinchu saaradhi--