ప్రేమే శాశ్వతమైన పరిశుద్ధమైన పొదరిల్లు
మనస్సే మందిరమాయే నా మదిలో దీపము నీవే
నిన్ను ఆశ్రయించిన వారిని ఉదయించు సూర్యునివలెనే
నిరంతరం నీ మాటతో ప్రకాశింపచేయుదువు ||ప్రేమే||
1. అమరమైన నీ చరితం విమలమైన నీ రుధిరం
ఆత్మీయముగా ఉత్తేజపరిచిన పరివర్తనక్షేత్రము (2)
ఇన్నాళ్లుగా నను స్నేహించి - ఇంతగ ఫలింపజేసితివి
నీ స్వర సంపదనంతటితో - అభినయించి నే పాడెదను
ఉండలేను - బ్రతకలేను - నీ తోడు లేకుండా
నీ నీడ లేకుండా ||ప్రేమే||
2. కమ్మనైన నీ ఉపదేశము విజయమిచ్చె శోధనలో
ఖడ్గముకంటే బలమైన వాక్యము ధైర్యమిచ్చే నా శ్రమలో (2)
కరువు సీమలో సిరులొలికించెను - నీ వాక్య ప్రవాహము
గగనము చీల్చి