ప్రేమమయా - యేసు ప్రభువా
నిన్నే స్తుతింతును - ప్రభువా
అనుదినమూ - అనుక్షణము నిన్నే స్తుతింతును - ప్రభువా || ప్రేమ ||
1. ఏ యోగ్యత లేని నన్ను నీవు ప్రేమతో పిలిచావు
ప్రభువా నన్నెంతగానో ప్రేమించినావు నీ ప్రాణ మిచ్చావు నాకై || ప్రేమ ||
2. ఎదవాకిటను - నీవు నిలిచి నా హృదయాన్ని తట్టావు
ప్రభువా హృదయాంగనములోకి అరుదెంచినావు నాకెంతో ఆనందమే || ప్రేమ ||
3. శోధనలు నను చుట్టుకొనినా ఆవేదనలు నను అలముకొనినా
శోధన రోదన ఆవేదనలో నిన్నే స్తుతింతును ప్రభువా || ప్రేమ ||
--Premamaya yesu prabhuva--