ప్రేమమయుడా నా యేసయ్యా

Telugu Christian Song

ప్రేమమయుడా నా యేసయ్యా నీ ప్రేమను వివరించలేనయ్యా (2) నీ ప్రేమను వర్ణించలేనయ్యా నీ ప్రేమకు వెలకట్టలేనయ్యా (2) నీ ప్రేమను నే మరువలేనయ్యా 1. దారి తప్పి తిరుగుచుండగా చల్లని స్వరముతో పిలిచితివి తండ్రి సిలువలో పలికిన నీ మాటలే ఆకర్షించెను నా హృదయమును (2) నీ మాటలే నన్ను బ్రతికించినది ఆవేదనలో ఆదరించినది (2) 2. బ్రతుకు భారమై అలసి ఉండగా నీ రెక్కల పై మోసితివి తండ్రి సిలువలో చూపిన నీ ప్రేమయే బ్రతకాలనే ఆశ కలిగించినది (2) నీ ప్రేమయే నన్ను చేరదీసేను జీవితమునకు విలువ కలిగెను (2) 3. ఈ లోక ప్రేమలు మారిపోవును శాశ్వతమైనది నీ ప్రేమయే తండ్రి సిలువలో చేసిన నీ త్యాగమే రక్షణ భాగ్యము నా కోసగినది (2) నీ ప్రేమ నాలో పరిమ
Telugu
18 views