ప్రేమ శాశ్వత కాలముండును

Telugu Christian Song

ప్రేమ శాశ్వత కాలముండును ప్రేమ అన్నిటిలో శ్రేష్టము (2) ప్రేమ విలువను సిలువ జూపె ప్రేమ ఎట్టిదో ప్రభువు నేర్పె (2) ప్రేమ చూపు నరుల యెడల ప్రేమ కలిగియుండు ప్రియుడా ||ప్రేమ|| ప్రేమలో దీర్ఘశాంతము ప్రేమలో దయాళుత్వము (2) ప్రేమ సహింప నేర్పును ప్రేమ కలిగియుండు ప్రియుడా ||ప్రేమ|| ప్రేమలో డంబముండదు ప్రేమ ఉప్పొంగదెప్పుడు (2) ప్రేమలో తగ్గింపున్నది ప్రేమ కలిగియుండు ప్రియుడా ||ప్రేమ|| ప్రేమించు సహోదరుని ప్రార్ధించు శత్రువుకై (2) ప్రేమ యేసుని మనస్సు ప్రేమ కలిగియుండు ప్రియుడా ||ప్రేమ|| ప్రేమలో సత్యమున్నది ప్రేమ సంతోషమిచ్చును (2) ప్రేమయే సమాధానము ప్రేమ కలిగియుండు ప్రియుడా ||ప్రేమ|| విశ్వాసము నిరీక్షణ ప్రేమ ఈ
Telugu